బ్రకోలీ అనేది కాలిఫ్లవర్, క్యాబేజీ మాదిరిగానే క్రూసిఫెరస్ కూరగాయ. ఇది శరీరానికి అవసరమైన అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అందుకే దీనిని పోషకాల శక్తి కేంద్రంగా పిలుస్తారు. బ్రోకోలీ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుండి జ్ఞాపకశక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడమే కాకుండా, క్యాన్సర్ తో పోరాడుతుంది.