పర్పుల్ క్యారెట్లు కూడా సహజసిద్ధమైనవే, జన్యుపరంగా పండించినవి కావు. వీటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు కె, బి6, సి పుష్కలంగా ఉంటాయని నిపుణులు తెలిపారు. ఆంథోసయనిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. కెరోటినాయిడ్స్ విటమిన్ Aగా మారి కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచి హార్ట్ హెల్త్‌ను కాపాడుతాయి.