కోళ్ల పందేలు ఎన్ని రకాలుంటాయో తెలుసా..?

61చూసినవారు
కోళ్ల పందేలు ఎన్ని రకాలుంటాయో తెలుసా..?
సంక్రాంతి పండుగ సందర్భంగా కుక్కుట శాస్త్రం ప్రకారం మూడు రకాల కోడి పందేలు నిర్వహిస్తారు. మొదటిది కోడి కత్తి పందెం, ఇందులో కోడి కాలికి కత్తి కడతారు. రెండోది విడి కాలు పందెం (డెంకీ పందెం). మూడోది ముసుగు పందెం, ఇందులో కోడిని ముసుగులో తెస్తారు, అది ఏ కోడో బరిలో దిగే వరకు ఎవరికీ తెలియదు. కుక్కుట శాస్త్రం ప్రకారం.. ఏ రోజు ఏ దిశలో కోడి పుంజులను పందెం కోసం వదలాలో పందెం రాయుళ్లు ముందు జాగ్రత్తగా అంచనా వేసుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్