
న్యూస్ ఛానళ్లకు TRP రేటింగ్‌ల నిలిపివేసిన కేంద్రం!
దేశంలోని వార్తా ఛానళ్లలో పెరుగుతున్న సంచలనాత్మక ధోరణిని అరికట్టేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. న్యూస్ ఛానళ్ల టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) నివేదికలను నాలుగు వారాల పాటు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిలిపివేయాలని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC)ను ఆదేశించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొన్ని ఛానళ్లు ఊహాజనిత, అతిశయోక్తి వార్తలు ప్రసారం చేస్తున్నాయని, ఇది ప్రజల్లో అనవసర ఆందోళన కలిగిస్తోందని మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిషేధం నాలుగు వారాల పాటు అమల్లో ఉంటుంది.




