రాగులు తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగుల్లో లెకిథిన్, మిథియోనైన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటిలో ఉండే మెగ్నిషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. రాగులను పిండి రూపంలో తీసుకుంటే రోజుకు 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. మరీ అధికంగా తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి.