నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో తెలుసా?

25చూసినవారు
నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో తెలుసా?
దేశంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ సూచిస్తోంది. ముఖ్యంగా రూ.500 నకిలీ నోట్లు ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది. అసలు నోటును గుర్తించేందుకు మూడు ముఖ్య లక్షణాలను పరిశీలించాలని తెలిపింది. నోటులోని సెక్యూరిటీ థ్రెడ్‌ను వంచితే ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారాలి. మహాత్మా గాంధీ చిత్రం, నోటు విలువ వాటర్‌మార్క్ రూపంలో స్పష్టంగా కనిపించాలి. అలాగే నోటు వెనుక భాగంలో స్వచ్ఛ భారత్ లోగో, భాషా ప్యానెల్, ముద్రణ నాణ్యత స్పష్టంగా ఉండాలి. అనుమానం ఉంటే ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పరిశీలించవచ్చు.

సంబంధిత పోస్ట్