గంగా నదికి స్వయంగా నీటిని శుద్ధి చేసుకునే అద్భుతమైన సామర్థ్యం ఉంది. దీని వెనుక 'బ్యాక్టీరియోఫేజ్' అనే వైరస్లు, అధిక ఆక్సిజన్ స్థాయిలు, సూర్యకాంతి, ప్రవాహ వేగం, సహజ అవక్షేపణ వంటి శాస్త్రీయ కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్లు ప్రమాదకర బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. అయితే, ప్రస్తుతం విపరీతమైన రసాయన, మానవ వ్యర్థాల కాలుష్యం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఈ సహజ శుద్ధి సామర్థ్యం తగ్గుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.