రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా నగర్ గ్రామంలో 500 ఏళ్లుగా హోలీ పండుగను మహిళలు మాత్రమే జరుపుకుంటున్నారు. ఈ సంప్రదాయం ప్రకారం, హోలీ రోజున గ్రామస్తులైన పురుషులందరూ గ్రామాన్ని వదిలి శివార్లలోని చాముండీ మాత ఆలయానికి వెళ్లి భక్తి పాటలు వింటూ గడుపుతారు. మహిళలు స్వేచ్ఛగా, ఆనందంగా వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారం ప్రారంభమైంది. నియమాన్ని అతిక్రమించిన వారికి ఊరిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఈ రోజున మహిళలు పురుషుల దుస్తులు ధరించి నృత్యం చేస్తారు. హోలీ మరుసటి రోజు స్త్రీపురుషులు కలిసి రంగులు చల్లుకుంటూ వేడుకను ముగిస్తారు.