ప్రపంచ వెదురు దినోత్సవం ఏటా ఏ రోజున నిర్వహిస్తారో తెలుసా?

10805చూసినవారు
ప్రపంచ వెదురు దినోత్సవం ఏటా ఏ రోజున నిర్వహిస్తారో తెలుసా?
వెదురు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 18న 'ప్రపంచ వెదురు దినోత్సవం'గా నిర్వహిస్తారు. ప్రపంచ వెదురు సంస్థ ఆధ్వర్యంలో 2009లో బ్యాంకాక్‌లో ప్రపంచ వెదురు కాంగ్రెస్ ఎనిమిదో సభ జరిగింది. దీనికి సుమారు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఏటా సెప్టెంబరు 18న 'ప్రపంచ వెదురు దినోత్సవం'గా జరుపుకోవాలని ఈ సమావేశంలో ప్రకటించారు. దీన్ని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి.

సంబంధిత పోస్ట్