మధ్యాహ్న సమయంలో నిద్రపోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చురుకుదనం, ఆలోచనల్లో స్పష్టత, జ్ఞాపకశక్తి సామర్థ్యం పెరుగుతాయని అంటున్నారు. 20 నుంచి 30 నిమిషాల పగటి నిద్ర వల్ల సానుకూల ప్రయోజనాలు ఉంటాయని, కానీ అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోతే బద్ధకం, రాత్రి వేళల్లో నిద్ర లేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల సమయం ఈ నిద్రకు అనువైందని సూచించారు.