రైల్వే స్టేషన్, రైల్వే జంక్షన్‌కు మధ్య తేడా ఏంటో తెలుసా?

రైల్వే స్టేషన్ అంటే ప్రయాణికులు ఎక్కి దిగే ప్రదేశం. స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్‌లు, వెయిటింగ్ రూములు, టికెట్ కౌంటర్లు వంటి సౌకర్యాలు ఉంటాయి. అయితే, ప్రతి స్టేషన్ జంక్షన్ కాదు. కనీసం మూడు వేర్వేరు రైలు మార్గాలు కలిసే ప్రదేశాన్ని రైల్వే జంక్షన్ అంటారు. అలహాబాద్, మధుర, విజయవాడ జంక్షన్లు ప్రముఖమైనవి. జంక్షన్‌గా ప్రకటించడానికి, కనీసం మూడు దిశల్లో ట్రాక్‌లు కలవాలి. రైలు ట్రాఫిక్, ప్రయాణీకుల సంఖ్య, కార్యాచరణ ప్రాముఖ్యతను కూడా పరిగణిస్తారు. జంక్షన్లలో రైలు మార్గమార్పు, దారి మార్పు, షంటింగ్ వంటి కార్యకలాపాలు జరుగుతాయి.
