చాట్‌జీపీటీలో GPT మీనింగ్ తెలుసా?

140చూసినవారు
చాట్‌జీపీటీలో GPT మీనింగ్ తెలుసా?
చాట్‌జీపీటీలో జీపీటీ అంటే 'జెనరేటివ్ ప్రీ ట్రెయిన్డ్ ట్రాన్స్‌ఫార్మర్'. జెనరేటివ్ అంటే కొత్త కంటెంట్ సృష్టించడం, పాత ఏఐల వలె కాకుండా ఇది కథలు, కోడ్, కవితలు, మనుషుల్లా మాట్లాడే వాక్యాలు వంటివి తయారుచేస్తుంది. ప్రీ ట్రెయిన్డ్ అంటే ఇది ఇప్పటికే అనేక పుస్తకాలు, ఆర్టికల్స్, వెబ్‌సైట్స్ నుండి శిక్షణ పొందింది. ట్రాన్స్‌ఫార్మర్ అనేది జీపీటీకి మెదడు లాంటిది, ఇది 2017లో గూగుల్ శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టిన టెక్నిక్. ఇది వాక్యంలోని ముఖ్యమైన పదాలపై దృష్టి సారించి, పొడవైన వాక్యాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.

సంబంధిత పోస్ట్