జపాన్‌కు చెందిన సైన్స్ సంస్థ, కేవలం 15 నిమిషాల్లో మనిషిని శుభ్రం చేసే మిరాయ్ హ్యూమన్ వాషింగ్ మెషిన్‌ను రూపొందించింది. మొదట్లో ఎలక్ట్రానిక్ ఎక్స్‌పోలో ప్రదర్శన కోసం తయారుచేసినా, దీనికి వచ్చిన ఆదరణతో వాణిజ్యపరంగా విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో టోక్యోలో జరిగిన ఒసాకా- కాన్సాయ్ ఎక్స్‌పోలో ప్రదర్శించినప్పుడు, 40 వేల మంది దీన్ని ప్రయత్నించడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో మెషిన్ ధర సుమారు రూ.3 కోట్లుగా నిర్ణయించారు. ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారనేది ఇంకా వెల్లడించలేదు.