ప్రపంచంలోనే అత్యంత రహస్య దేశంగా పేరుగాంచిన నార్త్ కొరియా అసలు అధికారిక పేరు డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK). పేరులో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ, అక్కడ ఏకపక్ష పాలన కొనసాగుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో కొరియా ద్వీపకల్పం రెండు భాగాలుగా విడిపోయింది. ఉత్తర భాగం సోవియట్ యూనియన్ ప్రభావంలోకి, దక్షిణ భాగం
అమెరికా ప్రభావంలోకి వెళ్లడంతో నార్త్, సౌత్ కొరియాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కిమ్ కుటుంబానికి చెందిన మూడో తరం నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశాన్ని పాలిస్తున్నారు.