సైక్లోస్పోరా ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. యూఎస్ వ్యాప్తంగా 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే సైక్లోస్పోరా అనేది కంటికి కనిపించని సూక్ష్మ పరాన్నజీవి. ఇది మానవ శరీరంలోకి ప్రవేశించి, ప్రధానంగా ప్రేగులపై దాడి చేసి జీర్ణవ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ పరాన్నజీవి వల్ల వచ్చే కడుపు సంబంధిత వ్యాధిని వైద్య పరిభాషలో 'సైక్లోస్పోరియాసిస్' అంటారు. ఈ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన అవసరం.