ఎడతెరిపి లేకుండా భావోద్వేగాలను అణిచిపెట్టడం మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సైకాలజిస్ట్ గుర్లీన్ బరువా చెబుతున్నారు. ఒక వ్యక్తి చాలాకాలం ఏడవకపోతే అతనిలో చిరాకు, విసుగు పెరిగే అవకాశం ఉంది. ఎమోషన్లు బయటపడకపోవడం వల్ల మొద్దుబారిన భావాలు, అపరాద భావం, కోపం, ఆందోళన తలెత్తుతాయి. ఇవి తలనొప్పులు, జీర్ణ సమస్యలు, అలసటకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.