పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న ఏపీలోని బాపట్లలో కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. ఆయన అన్నయ్యలు
మెగాస్టార్ చిరంజీవి,
నాగబాబు. చిన్నతనం నుంచే చదువు కంటే మార్షల్ ఆర్ట్స్, ఆధ్యాత్మికత, ప్రకృతిపై ఆసక్తి చూపిన ఆయన.. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి 'పవన్' పేరు పొందారు. అల్లు రామలింగయ్య సూచనతో 'పవన్ కళ్యాణ్' గా పేరు మార్చుకుని.. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు.