భారతదేశంలో మొబైల్ గేమింగ్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, 2026 తొలి త్రైమాసికంలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన గేమ్‌గా 'లూడో కింగ్' నిలిచింది. కుటుంబంతో కలిసి ఆడుకునే ఈ గేమ్ ఇప్పటికీ టాప్‌లో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఫ్రీ ఫైర్ ఉండగా, వేగవంతమైన గేమ్‌ప్లే కారణంగా యువతను ఆకట్టుకుంటోంది. మూడో స్థానంలో క్రికెట్ లీగ్ నిలిచింది. ఇక నాలుగో స్థానంలో పిజ్జా రెడీ! , ఐదో స్థానంలో క్యారమ్ పూల్ చోటు దక్కించుకున్నాయి.