ప్రపంచంలోనే అత్యంత ధనిక బ్యాంకు ఏదో తెలుసా?

65చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ధనిక బ్యాంకు ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ధనిక బ్యాంకుగా చైనా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) నిలిచింది. 6.9 ట్రిలియన్ డాలర్ల ఆస్తులతో, ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. 1984 జనవరి 1న స్థాపించబడిన ఐసీబీసీ, 2012 నుండి ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతోంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,456 శాఖలు ఉన్నాయి, వీటిలో 416 శాఖలు వివిధ ఖండాలలో విస్తరించి ఉన్నాయి. చైనా ప్రభుత్వమే దీని అతిపెద్ద వాటాదారుగా ఉంది.