గుండెపోటు వచ్చే రిస్క్‌ని ముందుగా గుర్తించే పరీక్ష ఏంటో తెలుసా?

17386చూసినవారు
గుండెపోటు వచ్చే రిస్క్‌ని ముందుగా గుర్తించే పరీక్ష ఏంటో తెలుసా?
ప్రస్తుతం పని ఒత్తిడి, యాంత్రిక జీవనశైలి కారణంగా గుండెపోటు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యల ముందస్తు గుర్తింపుకు 'కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కాన్' ఉపయోగపడుతుంది. ఇది గుండె రక్తనాళాల్లో ప్లాక్, కాల్షియం ఎంత ఉందో చూపిస్తుంది. స్కోర్ 0 ఉంటే 10 సంవత్సరాల్లో హార్ట్ ఎటాక్ రిస్క్ 1–2% మాత్రమే, కానీ 100 దాటితే రిస్క్ 25–30% పెరుగుతుంది. 40–70 ఏళ్లలో రిస్క్ తెలియని వారికి ఈ స్కాన్ చాలా సహాయపడుతుంది. కాల్షియం స్కోర్ తెలుసుకుని అవసరమైతే జీవనశైలి, మందుల మార్పులు చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్