ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాహనాల వినియోగం పెరిగి కాలుష్యం పెరుగుతోంది. దీనిని అరికట్టడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆధునిక జీవనశైలి వల్ల సైకిళ్ల వినియోగం తగ్గింది. ఈ పరిస్థితిలో సైకిల్ వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో అమెరికాలోని మాంట్‌గోమరీ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ లెస్జెక్ సిబిల్స్ ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదంతో 2018 జూన్ 3న మొదటిసారిగా ఈ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.