పెళ్లి సంబంధాల కోసం మార్కెట్‌.. ఎక్క‌డో తెలుసా?

6చూసినవారు
పెళ్లి సంబంధాల కోసం మార్కెట్‌.. ఎక్క‌డో తెలుసా?
ప్రపంచం డిజిటల్ వైపు వెళ్తున్నా, చైనాలోని షాంఘైలో మాత్రం పెళ్లి సంబంధాల కోసం ఒక ప్రత్యేక మార్కెట్ కొనసాగుతోంది. ప్రతి వారాంతంలో పీపుల్స్ పార్క్‌లో జరిగే ఈ మార్కెట్‌లో యువతీయువకుల తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు వచ్చి బయోడాటాలు ప్రదర్శించి, సంబంధాలు వెతుకుతారు. వయసు, విద్య, ఆదాయం, కుటుంబ నేపథ్యం వంటి వివరాలతో కూడిన బయోడాటాలను చెట్లకు, గోడలకు అమర్చుతారు. ప్రాథమిక చర్చలు సానుకూలంగా ఉంటే, ప్రత్యక్షంగా కలిసే ఏర్పాట్లు చేస్తారు. సుమారు 25 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్