జపాన్ లో పండించే కిన్మెమెయ్ రకం బియ్యానికి ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే బియ్యంగా పేరుంది. ఈ రకాన్ని కేజీ రూ.12 వేల నుంచి రూ.15వేల దాకా విక్రయిస్తారు. అందులోని పోషక విలువలు, నాణ్యత, రుచికి మరే బియ్యం సాటి రావని కొందరు రైతులు చెబుతారు. 'రిన్స్ ఫ్రీ రైస్'గా పిలిచే ఈ బియ్యాన్ని కడగకుండానే నేరుగా వండొచ్చు. ప్రస్తుతం 'టోయో' అనే సంస్థ ఈ బియ్యంపై పేటెంట్ తీసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది.