ప్రతి ఏటా పెరుగుతున్న శివలింగం.. ఎక్కడో తెలుసా?

5చూసినవారు
ప్రతి ఏటా పెరుగుతున్న శివలింగం.. ఎక్కడో తెలుసా?
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా కలానౌర్‌లో ఉన్న శయన శివాలయం, భూమికి అడ్డంగా ఉన్న శివలింగంతో ప్రత్యేకతను సంతరించుకుంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో సైనిక శిబిరం ఉన్నప్పుడు, గుర్రాలు కుంటుపడటంతో తవ్వగా ఓ నల్లటి శివలింగం బయటపడిందని చరిత్ర చెబుతోంది. శివలింగాన్ని తొలగించే ప్రయత్నంలో రక్తం స్రవించిందని, అప్పుడు అశరీరవాణి వినిపించిందని, దానితో అక్బర్ ఆలయాన్ని నిర్మించాడని స్థానిక కథనం. ఇక్కడి శివలింగం ప్రతి ఏటా క్రమక్రమంగా పరిమాణంలో పెరుగుతుందని భక్తుల నమ్మకం. #Hidden Secrets of Telugu Temples ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you