ఒకప్పుడు ప్రయాణాలకు మార్గనిర్దేశం చేసిన మైలురాళ్లు, గూగుల్ మ్యాప్స్ రాకతో తమ ప్రాధాన్యతను కోల్పోతున్నాయి. వరంగల్ నుంచి హైదరాబాద్ 151 కి.మీ., కరీంనగర్ నుంచి హైదరాబాద్ 160 కి.మీ. వంటి మైలురాళ్లు రహదారుల వెంబడి కనిపిస్తున్నా, వాటి ప్రాముఖ్యత తగ్గిపోతోంది. హైదరాబాద్‌లో శాసనసభ ఎదురుగా, రవీంద్రభారతి నుంచి నాంపల్లి వైపు వెళ్లే మార్గంలో ఎడమవైపు ఉన్న 'సున్నా' (0) మైలు రాయి బ్రిటిష్ కాలం నాటిది. ఈ చారిత్రక చిహ్నాలు క్రమంగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి.