సంక్రాంతి రోజున ఇళ్లను తగులబెడతారు.. ఎక్కడో తెలుసా?

12860చూసినవారు
సంక్రాంతి రోజున ఇళ్లను తగులబెడతారు.. ఎక్కడో తెలుసా?
అసోంలో సంక్రాంతి పండుగను మాగ్ బిహును అని లేదా భోగాలి బిహు అని పిలుస్తారు. అసోంలో ఇది పంటలకు సంబంధించిన పండుగ. ఈ పండుగ వేడుకల్లో భాగంగా ఉత్సవాలు, దీపోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడి యువత బిహు సమయంలో వెదురు ఆకులు, గడ్డితో మెజీ అనే ఇళ్లను నిర్మిస్తారు. మరుసటి రోజు ఆ గుడిసెలను తగులబెట్టి, పండుగకు చేసిన ప్రత్యేక వంటకాలను ఆస్వాదిస్తారు. ఇంకా టేకేలి భోంగా (కుండ పగలగొట్టడం), గేదెల పోరు వంటి స్థానిక సంప్రదాయ కళలు కూడా పండుగలో భాగంగా ఉంటాయి.

సంబంధిత పోస్ట్