శివలింగానికి సజీవ పీతలతో పూజ.. ఎక్కడో తెలుసా?

12చూసినవారు
శివలింగానికి సజీవ పీతలతో పూజ.. ఎక్కడో తెలుసా?
గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న రుంధనాథ్ మహాదేవ్ ఆలయంలో శివలింగానికి సజీవ పీతలను సమర్పించే అరుదైన ఆచారం కొనసాగుతోంది. తాపి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో, చెవి సమస్యల నివారణ కోసం భక్తులు పీతలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ఆలయాన్ని స్థాపించి, పీతల భక్తికి మెచ్చి ఈ వరాన్ని ప్రసాదించాడని పురాణ కథనం. పూజ అనంతరం పీతలను తిరిగి తాపి నదిలో వదిలేస్తారు, వాటికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్