జియోగ్రాఫికల్ ఫ్యాక్ట్ ప్రకారం, దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ దేశం అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఉంది. భూమి పూర్తిగా గోళాకారంగా ఉండక, భూమధ్యరేఖ వద్ద కొంచెం ఉబ్బెత్తుగా ఉండటమే దీనికి కారణం. ఈక్వెడార్‌లోని మౌంట్ చింబొరాజో శిఖరం, భూమి కేంద్రం నుంచి చూస్తే అత్యంత దూరంలో ఉన్న పాయింట్. దీని ఎత్తు సముద్ర మట్టం నుంచి 6,263 మీటర్లు. చింబొరాజోపై నిలబడితే, ఎవరెస్ట్‌పై నిలబడిన వారి కంటే అంతరిక్షానికి 2.1 కిలోమీటర్లు దగ్గరగా ఉంటారు.