కాళ్లు లేని పాములకు ఎముకలు ఉండవు అనుకోవడం పొరపాటు. ప్రపంచంలోనే అత్యధిక ఎముకలు కలిగిన జీవి కొండచిలువ (పైథాన్). పెద్ద పైథాన్‌లలో ఏకంగా 1800 వరకు ఎముకలు ఉంటాయి. సాధారణ పాముల్లో 400–500 ఎముకలు ఉంటాయి. తల నుంచి తోక వరకు ఉండే వందలాది వెన్నుపూసలు, పక్కటెముకల వల్ల పాములు మెలికలు తిరుగుతూ వేగంగా కదలగలుగుతాయి. అనువైన దవడ ఎముకల నిర్మాణం వల్ల పాములు తమ తల కంటే పెద్ద ఎరను కూడా సులభంగా మింగగలవు. మనిషిలో 206, ఏనుగులో సుమారు 280 ఎముకలుంటాయి.