ఇండియాలో ఉసిరికాయ రాజధానిగా ఏ జిల్లాను పిలుస్తారో తెలుసా?

11చూసినవారు
ఇండియాలో ఉసిరికాయ రాజధానిగా ఏ జిల్లాను పిలుస్తారో తెలుసా?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ను 'ఆమ్లా క్యాపిటల్ ఆఫ్ ఇండియా'గా పిలుస్తారు. ఇక్కడ సుమారు 20 వేల హెక్టార్లలో ఉసిరి తోటలు విస్తరించి ఉన్నాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే ఉసిరిలో 60% ఇక్కడి నుంచే వస్తుంది. 2023 మార్చిలో GI ట్యాగ్ పొందిన ఈ ఉసిరి, 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' (ODOP) కింద ఎంపికైంది. క్యాండీ, మురబ్బా, జ్యూస్, పొడి వంటి ఉత్పత్తులను 100 ప్రాసెసింగ్ యూనిట్లు తయారు చేస్తూ, రైతులకు, మహిళా సంఘాలకు ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రధాని మోదీ సైతం 'మన్ కీ బాత్'లో ఈ పరిశ్రమను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్