మనలో చాలా మంది ప్రపంచంలో ఎక్కువగా తినే పండు అంటే ఆపిల్ అనుకుంటాం. కానీ నిజానికి ఆ రికార్డు అరటిపండుదే. అరటిపండు తక్కువ ధరకు లభించడం, సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండటం, అలాగే అధిక పోషక విలువలు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండుగా నిలిచింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సులభంగా తినగలిగే పండు కావడంతో ఇది గ్లోబల్‌గా అత్యంత ప్రజాదరణ పొందింది. అరటిపండులో పొటాషియం, ఫైబర్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉండటం వల్ల ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.