భారతీయులకు మాత్రమే ఎందుకు పెద్ద బొజ్జ ఉంటుందో తెలుసా?

5చూసినవారు
భారతీయులకు మాత్రమే ఎందుకు పెద్ద బొజ్జ ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే భారతీయులకు భారీ పొట్ట ఉండటానికి జీవనశైలే ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు. 40 ఏళ్లు దాటిన తర్వాత జీవక్రియ మందగించడం, కండరాల బలహీనత, హార్మోన్ల మార్పులు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో బరువు తగ్గడం కష్టమవుతుందని వివరించారు. ఈ వయసులో బరువు పెరగడం ఆందోళనకరమని, జీవక్రియ వేగం తగ్గడం వల్ల కేలరీలు సరిగా దహనం కాకపోవడం, కండర ద్రవ్యరాశి కోల్పోవడం వల్ల కొవ్వు పేరుకుపోతుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం, చక్కెర, జంక్ ఫుడ్ తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి సూచనలు పాటించడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్