గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారో తెలుసా?

9109చూసినవారు
గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారో తెలుసా?
గిరి ప్రదక్షిణ అనేది ప్రకృతిని దైవంగా భావించి చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక యాత్ర. అరుణాచలం, సింహాచలం, ఇంద్రకీలాద్రి, యాదగిరిగుట్ట వంటి ప్రాంతాల్లో ఇది ప్రాచుర్యం పొందింది. 'గిరి' అంటే కొండ, 'ప్రదక్షిణ' అంటే దైవాన్ని కుడివైపు ఉంచుకుని చుట్టూ తిరగడం. పవిత్రమైన కొండను లేదా దేవాలయం ఉన్న పర్వతాన్ని భక్తితో చుట్టి రావడమే గిరి ప్రదక్షిణ. పురాణాల ప్రకారం, గిరి ప్రదక్షిణకు ఆద్యుడు వినాయకుడు. శాస్త్రం ప్రకారం, 'పర్వతం' పరమశివుడి రూపం. అందుకే అరుణాచలంలో చేసే గిరి ప్రదక్షిణ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనదిగా, మొదటిదిగా పేరొందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్