కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి కారణముందని పెద్దలు చెబుతుంటారు. ప్రతీ మనిషి శరీరం ఒక రథం అని .. ఈ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించటమే.. ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలని కలిగించాలని కోరుతూ.. ఇంటి ముంగిట రథం ముగ్గుని వేసి పువ్వులు, పసుపు, కుంకుమతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకూ సాగనంపుతారు.