చాలామందికి టీ, కాఫీలు తాగే ముందు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. టీ, కాఫీలలో ఎసిడిక్ గుణాలు అధికంగా ఉండడం వల్ల వాటిని ఎక్కువగా సేవిస్తే అల్సర్ సహా ఇతర ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని వివరించారు. అందుచేత టీ, కాఫీ తాగే ముందు ఒక గ్లాసు నీరు తాగితే, వాటి ఎసిడిక్ ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు.