క్రమం తప్పకుండా ఫుట్ మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫుట్ మసాజ్ అనేది ఒత్తిడి, మడమ నొప్పులను తగ్గిస్తుంది. రోజూ 5-10 నిమిషాలు నూనెతో మసాజ్ చేయడం వల్ల కండరాలు విశ్రాంతి పొంది, మంచి నిద్ర వస్తుంది. అంతేకాకుండా మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ, నెలసరి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.