ఇప్పుడు పిల్లలకు డైపర్లు వేయడం అనేది కామన్. ప్రయాణాలు, రోజువారీ పనుల్లో సౌలభ్యం కలిగించే డైపర్లను సరిగ్గా వాడకపోతే పిల్లలకు ర్యాషెస్, దద్దుర్లు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి 3 గంటలకు డైపర్ మార్చాలి. వాడినవే మళ్లీ వాడకూడదు. మార్చినప్పుడల్లా వేడినీళ్లతో శుభ్రపరిచి కాటన్ బట్టతో తుడవాలి. కొంతసేపు గాలి తగలాలి. కాటన్ డైపర్లు ఉత్తమం, డిస్పోజబుల్ డైపర్లు ప్రయాణాలకు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.