ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన 93ఏళ్ల డాక్టర్ జాన్ లెవిన్ నాలుగోసారి తండ్రిగా మారి వార్తల్లో నిలిచాడు. ఆయన తన 37ఏళ్ల భార్య డాక్టర్ యాంగ్ యింగ్ లూతో కలిసి ఐవీఎఫ్ ద్వారా 2024 ఫిబ్రవరిలో కుమారుడు గాబీకి జన్మనిచ్చారు. ఈ జంట మధ్య వయస్సు తేడా 57 ఏళ్లు. లెవిన్‌కు 60 ఏళ్లు దాటిన ముగ్గురు పిల్లలు, పది మంది మనవళ్లు, ఒక ముని మనవడు ఉన్నారు. అయితే ఆయన వస్సుతో సంబంధం లేకుండా పిల్లల్ని కనడంపై తాజాగా నెట్టింట హల్‌చల్ చేస్తోంది.