హైదరాబాద్‌లో మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. అమెరికా వీసా రాలేదని ఏపీలోని గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి మనస్తాపానికి గురయ్యారు. ఉన్నత విద్య కోసం US వెళ్లాలనుకుంది. ఈ క్రమంలో వీసా రాకపోవడంతో నిద్రమాత్రలు మింగి రోహిణి సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.