మధ్యప్రదేశ్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీలో వైద్యుడిగా సేవలందిస్తోన్న మేజర్ విజయ్ కుమార్ కారులోనే కుప్పకూలి చనిపోయాడు. అతను కూర్చున్న చోటే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కారులో చాలాసేపు కదలకుండా కూర్చోవడం గమనించిన పాదచారులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.