కర్ణాటక ధార్వాడ్‌లోని కర్ణాటక యూనివర్సిటీ రోడ్డులో ఉన్న అపార్ట్‌మెంట్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ కిరణ్ హోన్నన్నవర్ బుధవారం తన బెడ్‌రూమ్‌లో మెడపై తీవ్రమైన కత్తిపోట్లతో రక్తపు మడుగులో శవమై కనిపించారు. ఆయన చిన్న కుమారుడిపై కూడా ప్రాణాంతక దాడి జరగడంతో, బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమానంతో మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.