
తప్పు జరిగిందని జగన్ ఒప్పుకున్నారా?
AP: వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కోల్పోతున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ ఆయా అంశాలపై పార్టీ నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఇది పూర్తిగా హాట్ డిబేట్‌గా నడిచిందని తెలిసింది. ఈ సమావేశానికి అత్యంత సన్నిహితులైన కొందరిని మాత్రమే పిలిచారు. అదే సమయంలో తాను రాసి పెట్టుకున్న అంశాలను కూడా జగన్ వారికి వివరించారు. ఈ సమయంలోనే గత ఎన్నికల్లో తప్పులు జరిగాయని జగన్ అంగీకరించారు. కొందరు తనకు తెలియకుండా, తాను కొందరిని నమ్మడం వల్ల తప్పులు జరిగాయని చెప్పినట్లు సమాచారం.




