TG: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ బాధితురాలైన తల్లికి సకాలంలో వైద్యం అందలేదని ఆరోపిస్తూ, ఓ కుమారుడు ఆమెను వీల్‌చైర్‌లోనే ఎమ్మెల్యే నివాసానికి తీసుకెళ్లడం కలకలం రేపింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న తల్లికి సిబ్బంది సరిగ్గా స్పందించలేదని ఆరోపించిన కొడుకు, ఆమెను కిలోమీటరు దూరం వీల్‌చైర్‌పైనే ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీధర్ హామీ ఇవ్వడంతో, బాధితురాలిని తిరిగి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.