వైద్యులు షాక్.. మహిళ మెదడులో ఆస్కారిస్ పురుగు

0చూసినవారు
ఆస్ట్రేలియాలో ఓ మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల సజీవ పురుగును వైద్యులు కనుగొన్నారు. నెలలుగా కడుపునొప్పి, డయేరియా, జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న మహిళకు MRI తీయగా, మెదడులో ఒక వింత ముద్ద కనిపించింది. శస్త్రచికిత్సలో అది ఒఫీడాస్కరీస్ రొబర్టీస్ అనే రౌండ్‌వార్మ్ అని తేలింది. మానవుల మెదడులో ఇలాంటి పురుగు కనిపించడం ఇదే మొదటి కేసు. అడవి మొక్కల ద్వారా సూక్ష్మ గుడ్లు శరీరంలోకి చేరి, రక్తనాళాల ద్వారా మెదడుకు చేరినట్లు వైద్యులు భావిస్తున్నారు. దీనివల్ల తలనొప్పి, గందరగోళం, జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్