
అమర్నాథ్ యాత్ర-2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.
భారతదేశంలో అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్ర 2026కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28న ముగిసే ఈ యాత్ర, గత ఏడాదితో పోలిస్తే 57 రోజులు సుదీర్ఘంగా కొనసాగనుంది. లక్షలాది మంది భక్తులు మంచు శివలింగ దర్శనం కోసం ఈ యాత్రలో పాల్గొంటారు. భక్తులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 550కి పైగా బ్యాంక్ శాఖల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.




