
కారు బావిలో పడి యువకుడి మృతి
TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో ఓ కారు అదుపుతప్పి బావిలో పడటంతో శ్రీనివాస్ అనే యువకుడు మృతి చెందాడు. కడం(M) నర్సాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అత్యవసర పనిమీద రంగపేట్ వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా బీర్నంది గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్ముతండా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కడం మండలంలోని 'మన్ గ్రోమోర్' సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




