వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు కేసులు పెరుగుతంటాయి. పాములు చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి, వెలుతురును ఇష్టపడవు. కట్లపాము మినహా మిగతా విషపూరిత పాములు కాటు వేసే ముందు 'బుస్ బుస్' అని శబ్దం చేస్తూ హెచ్చరిస్తాయి. పాముకాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పాములు సంచరించే ప్రాంతాల్లో దోమతెరలు వాడటం, చీకటి ప్రదేశాల్లో వెలుతురు చూసుకుని వెళ్లడం, మందపాటి వస్త్రాలు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.