
100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీది: సీఎం (వీడియో)
AP: BSNL స్వదేశీ 4జీ సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్వదేశీ సాంకేతికతతో రూపొందిన 4జీ నెట్వర్క్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధాని మోదీది. మన దేశ ప్రజలనే కాదు, ప్రపంచ ప్రజల ప్రాణాలు కూడా కాపాడుకున్నాం. సింగపూర్, ఫ్రాన్స్లాంటి దేశాలు కూడా మనం తెచ్చిన UPIని స్వీకరించాయి” అని అన్నారు.




