సాధారణంగా అందరూ చక్కెరతో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వస్తుందని అనుకుంటారు. అయితే ఉప్పు ఎక్కువగా తినే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్టాక్‌హోమ్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. సాల్ట్ ద్వారా లభించే సోడియాన్ని రోజుకు 1.25 స్పూన్ల కంటే ఎక్కువగా తీసుకునే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం 72% కన్నా ఎక్కువగా ఉందని తేలింది.