ఇష్టమైన వారితో కలిసి భోజనం చేస్తే షుగర్ లెవల్స్ తగ్గుతాయా?

28చూసినవారు
ఇష్టమైన వారితో కలిసి భోజనం చేస్తే షుగర్ లెవల్స్ తగ్గుతాయా?
సన్నిహిత భాగస్వామితో కలిసి భోజనం చేస్తే.. ఒంటరిగా తినడంతో పోలిస్తే భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్‌ పెరుగుదల కొంత తక్కువగా ఉండొచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని హీబ్రూ యూనివర్సిటీ, షెబా మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు 54 జంటలపై ఈ అధ్యయనం చేశారు. ఒకే రకమైన కార్బోహైడ్రేట్‌ అధికంగా ఉన్న ఆహారాన్ని ఒంటరిగా, భాగస్వామితో కలిసి తినేలా చేసి గ్లూకోజ్‌ స్థాయిలను పరిశీలించారు. అయితే కలిసి భోజనం చేయడం వల్ల షుగర్‌ నేరుగా తగ్గుతుందని దీని అర్థం కాదు. ఒత్తిడి తగ్గడం, నాడీ వ్యవస్థ, హార్మోన్లలో మార్పులు వంటి అంశాలు కారణమై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్